Doug Emhoff: అవును! మొదటి భార్యను మోసం చేశాను.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త ఒప్పుకోలు!

Kamala Harris husband admits to cheating on first wife admits Doug Emhoff
  • అనూహ్యంగా అమెరికా అధ్యక్ష బరిలోకి దూసుకొచ్చిన కమలాహారిస్
  • ఆమె భర్త డగ్ ఎంహాఫ్‌ 15 ఏళ్ల క్రితం మరో మహిళతో సంబంధం పెట్టుకున్నారని ‘డెయిలీ మెయిల్’ కథనం
  • మొదటి భార్యను చీట్ చేసింది నిజమేనని అంగీకారం
  • అందుకు తనదే బాధ్యతన్న డగ్
అనూహ్యంగా అమెరికా అధ్యక్ష బరిలోకి వచ్చిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్తకు సంబంధించిన సంచలన విషయం ఒకదాన్ని బ్రిటిష్ టాబ్లాయిడ్ ‘ద డెయిలీ మెయిల్’ ప్రచురించింది. కమల భర్త డగ్ ఎంహాఫ్‌ మొదటి భార్యను మోసం చేశారని రాసుకొచ్చింది. డగ్‌ ఇద్దరు పిల్లలు చదివే ప్రైవేటు పాఠశాలలో బోధించే అందగత్తె నానీ, నాజెన్ నైలర్‌తో ఆయనకు ఎఫైర్ ఉన్నట్టు పేర్కొంది. 15 ఏళ్ల క్రితం నాటి మాట ఇదని, ఆయన అప్పటికే కెర్‌స్టిన్‌ను వివాహం చేసుకున్నారని తెలిపింది. ఈ విషయం తెలిసిన వ్యక్తి ఒకరు దీనిని బయటపెట్టారని వివరించింది. అంతేకాదు, డగ్ కారణంగా నేలర్ గర్భం కూడా దాల్చారని, అయితే, దానిని ఆమె కొనసాగించలేదని తెలిపింది.

కలకలం రేపిన ఈ కథనంపై డగ్ స్పందించారు. ‘సీఎన్ఎన్’తో ఆయన మాట్లాడుతూ..  నేలర్ పేరు, ఆమె గర్భం గురించి ప్రస్తావించకుండానే దీనిని అంగీకరించారు. తన చర్యల కారణంగా కెర్‌స్టిన్, తాను కొన్ని కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నట్టు గుర్తు చేసుకున్నారు. దీనికి పూర్తి బాధ్యత తనదేనని తెలిపారు. అయితే అ తర్వాత ఆ బంధం నుంచి బయటకు వచ్చినట్టు వివరించారు. 

మరోవైపు, కెర్‌స్టిన్ మాట్లాడుతూ.. డగ్, తాను వివిధ కారణాలతో చాలా ఏళ్ల క్రితమే తమ బంధాన్ని తెంచుకున్నట్టు తెలిపారు. తన పిల్లలకు ఆయన మంచి తండ్రి అని కితాబిచ్చారు. తమ మధ్య స్నేహం ఇంకా కొనసాగుతోందని తెలిపారు. డగ్, కమలా హారిస్, తాను కలిసి నిర్మించుకున్న ప్రేమ పూర్వక బంధానికి నిజంగా గర్వపడుతున్నట్టు తెలిపారు.
Doug Emhoff
USA
Najen Naylor
Kerstin
Kamala Harris

More Telugu News