Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌కు తగ్గుతున్న వరద
- 590 అడుగులకు గాను 585 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం
- ప్రస్తుతం 297.72 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వ
- జలాశయానికి 3,74,649 క్యూసెక్కుల ఇన్-ఫ్లో
నాగార్జున సాగర్‌కు వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇటీవల భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో తొలుత ఆరు గేట్లు ఎత్తారు. ఆ తర్వాత క్రమంగా 22 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 585.10 అడుగుల వద్ద ఉంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 297.72 టీఎంసీలు ఉన్నాయి. జలాశయానికి 3,74,649 క్యూసెక్కుల ఇన్-ఫ్లో ఉండగా.. 3,54,684 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది.
శ్రీశైలం డ్యాంకు నేటి వరకు వరద కొనసాగడంతో పదిగేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ డ్యామ్ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, నేటి మధ్యాహ్నం 883 అడుగులకు నీరు చేరింది. ప్రస్తుతం డ్యామ్‌లో 204.35 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. కుడి, ఎడమ గట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.