Blood Pressure: బీపీని నియంత్రించుకునే మార్గాలు ఇవే!
దేశంలో చాలా మంది బీపీ సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. శరీరంలో అధిక రక్తపోటు కారణంగా ఏర్పడే ఈ రోగం ఒక సైలెంట్ కిల్లర్ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితం, ఆహారపు అలవాట్లు, ఇతర కారణాలతో 30 ఏళ్ల వారికి కూడా బీపీ వస్తోంది. హైబీపీ అనేక సమస్యలకు దారితీస్తుంది. గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలతో పాటు తల నొప్పి, గుండె దడ వంటి సమస్యలు వస్తుంటాయి. ఒక్కసారి బీపీ పెరిగితే అది అదుపులోకి రావడానికి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అదుపులోకి వస్తుందో రాదో కూడా చెప్పలేం. అందుకే బీపీని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అయితే బీపీని నియంత్రించుకునేందుకు చాలా మంది వైద్యులు సూచించిన టాబ్లెట్‌ను వాడుతుంటారు.
అయితే మందులు వాడుతున్నప్పటికీ బీపీ నియంత్రణకు ఉపయోగపడే కొన్ని ఉత్తమమైన మార్గాలు ఉన్నాయి. బీపీ తగ్గుదలకు ఇవి ఎంతోగానో దోహదపడతాయి. ఈ విలువైన సమాచారాన్ని ఏపీ7ఏఎం వీడియో రూపంలో అందిస్తోంది. మరెందుకు ఆలస్యం వీడియోను పూర్తిగా వీక్షించండి.