Sri Lanka: మూడో వన్డేలోనూ టీమిండియాపై టాస్ గెలిచిన శ్రీలంక

Sri Lanka won the toss against Team India in third ODI
  • టీమిండియా-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్
  • నేడు కొలంబోలో మూడో వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య శ్రీలంక
గత రెండు వన్డేల్లోనూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని టీమిండియాను ఇబ్బందుల పాల్జేసిన ఆతిథ్య శ్రీలంక జట్టు... ఇవాళ చివరి వన్డేలోనూ టాస్ గెలిచి మరోసారి బ్యాటింగ్  ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ టై కాగా... రెండో వన్డేలో శ్రీలంక గెలిచింది. నేటి మ్యాచ్ లో కూడా శ్రీలంకే గెలిస్తే సిరీస్ వశమవుతుంది. భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. 

ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో రెండు మార్పులు జరిగాయి. కేఎల్ రాహుల్, అర్షదీప్ స్థానంలో రిషబ్ పంత్, రియాన్ పరాగ్ జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్ తో రియాన్ పరాగ్ అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అరంగేట్రం చేస్తున్నాడు. పరాగ్ ఈ ఉదయం కోహ్లీ చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు.

అటు, శ్రీలంక జట్టులో అఖిల ధనంజయ స్థానంలో తీక్షణ తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.
Sri Lanka
Toss
Team India
3rd ODI

More Telugu News