Narasimha Raju: కాంతారావుగారి ఆ ఇల్లు ఇప్పుడు కొన్ని కోట్లు: నటుడు నరసింహరాజు
- సీనియర్ నటుడిగా నరసింహరాజుకి పేరు
- 'జగన్మోహిని'తో వచ్చిన స్టార్ డమ్
- తన కెరియర్ గురించిన ముచ్చట్లు
- సీనియర్ ఆర్టిస్టుల గురించిన ప్రస్తావన
నరసింహరాజు .. 1970 - 80 దశకాలలో హీరోగా తన జోరు చూపించారు. 1974లో వచ్చిన 'నీడలేని ఆడది' సినిమాతో ఆయన పరిచయమయ్యారు. ఆ తరువాత చేసిన 'తూర్పు పడమర' .. ' జగన్మోహిని' సినిమాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అలాంటి నరసింహరాజు ప్రస్తుతం టీవీ సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా ఐడ్రీమ్స్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు.
అప్పట్లో సావిత్రిగారితో కలిసి నటించాను .. కానీ ఆమె అన్ని కష్టాలలో ఉన్నట్టుగా నాకు తెలియదు. ఆమె ఎప్పుడూ కూడా తన కష్టాలను గురించి చెప్పుకున్నట్టుగా నేను చూడలేదు. ఆమె కష్టాలను గురించి తెలిసినవారు ఆదుకుని ఉంటే బాగుండేదని అనిపిస్తూ ఉంటుంది. అలాగే పద్మనాభం గారు కూడా చెప్పుకునేవారు కాదు. తమ వేషానికి తగిన పారితోషికం తీసుకుని వెళ్లిపోయేవారు" అని అన్నారు.
"ఇక కాంతారావుగారితోను కలిసి నటించాను. కానీ ఎప్పుడూ ఆయన తన ఇబ్బందులను గురించి మాట్లాడింది లేదు. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ప్రదేశంలో గతంలో కాంతారావుగారు ఉండేవారట. 10 - 15 లక్షల అప్పు తీర్చడం కోసం ఆయన ఇక్కడి ఇల్లు అమ్ముకుని వెళ్లారు. ఇప్పుడు ఈ చోటు కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. ఆరోగ్యం .. ఆదాయం కాపాడుకుంటూ వెళుతున్నవారు అదృష్టవంతులనుకోవాలి" అని అన్నారు.