Burj Khalifa: వీటిని చూస్తే.. గుండెజారి గల్లంతవుతుంది!
30, 40 అంతస్తులున్న భవనం చూస్తేనే మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మన చుట్టుపక్కల కనిపించేవన్నీ ఆరేడు అంతస్తులు, మహా అయితే పదంతస్తులు ఉంటాయేమో. హైదరాబాద్ సహా కొన్ని నగరాల్లో మాత్రం 30 పైనే అంతస్తులున్న భవనాలున్నాయి. ఇక ప్రపంచంలోనే అంత్యంత ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా. దీని ఎత్తు కిలోమీటర్‌కు కొంచెం తక్కువ. మెడను పూర్తిగా పైకెత్తినా దీని ఎత్తును దగ్గర నుంచి చూడడం కష్టమే. బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమని అందరికీ తెలుసు. మరి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నవేంటో కూడా తెలుసుకుందామా!