Mohammed Yunus: బంగ్లాదేశ్ ప్రధానిగా నేడు మహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం

Mohammed Yunus was sworn in as the Prime Minister of Bangladesh today

  • మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్
  • గురువారం (ఇవేళ) రాత్రి 8 గంటలకు ప్రమాణ స్వీకారం
  • ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించిన ఆర్మీ చీఫ్ వకార్ – ఉజ్ - జమా

బంగ్లాదేశ్ లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి పరారై భారత్ లో తాత్కాలిక ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ నేతృత్వంలో జరిగిన కీలక భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ – ఉజ్ – జమా వెల్లడించారు. గురువారం రాత్రి బంగ్లాదేశ్ కాలమానం ప్రకారం 8 గంటలకు యూనస్ ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వంలో 15 మంది మంత్రులుగా ఉంటారని, వారి నియామకంపై అన్ని రాజకీయ పార్టీల భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఢాకాలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
 
మహమ్మద్ యూనస్ ను ప్రధానిగా ప్రతిపాదించింది ఎవరంటే..
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో ఉద్యమాన్ని చేపట్టిన విద్యార్ధి సంఘ నేతలు మహమ్మద్ యూనస్ ను తాత్కాలిక ప్రధాని పదవికి ప్రతిపాదించినట్లు సమాచారం. విద్యార్ధుల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యతను యూనస్ కు అప్పగించాలని నిర్ణయించారు. 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మహమ్మద్ యూనస్ ఒక వ్యాపారవేత్త, ఆర్ధిక వేత్త, పౌర సామాజిక వేత్త. గతంలో గ్రామీణ బ్యాంక్ కు మేనేజింగ్ డైరెక్టర్ గానూ బాధ్యతలు నిర్వహించారు. గ్రామీణ బ్యాంకును స్థాపించి పేద ప్రజలకు సేవలు అందించారు మహమ్మద్ యూనస్.

  • Loading...

More Telugu News