Indian Hockey Team: మన హాకీ జట్టు ప్రదర్శన చరిత్రలో నిలిచిపోతుందన్న చంద్రబాబు, నారా లోకేశ్

CM Chandrababu and minister Nara Lokesh hails Indian hockey team for winning bronze in back to back olympics

  • పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టు
  • వరుసగా రెండో ఒలింపిక్స్ లోనూ పతకం
  • గర్వపడేలా చేశారని అభినందించిన చంద్రబాబు, లోకేశ్
  • దేశానికి ఇవి సువర్ణ క్షణాలు అంటూ చంద్రబాబు ట్వీట్
  • గెలిచింది కాంస్యమే అయినా పసిడిని మించి కాంతులీనుతోందన్న లోకేశ్

పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్యం సాధించి యావత్ దేశాన్ని సంతోషంలో ముంచెత్తింది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ స్పందించారు. 

పారిస్ ఒలింపిక్ క్రీడల్లో మన హాకీ జట్టు అద్భుత విజయం నమోదు చేయడం సంతోషం కలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. వరుసగా రెండో పర్యాయం ఒలింపిక్ క్రీడల్లో కాంస్యం సాధించడం పట్ల అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. దేశానికి ఇవి సువర్ణ క్షణాలు అని అభివర్ణించారు. 

మంత్రి నారా లోకేశ్ ఇది చరిత్రలో నిచిపోయే ప్రదర్శన అని కొనియాడారు. ఈ విజయంతో కాంస్యం కూడా పసిడిని మించి కాంతులీనుతోందని అభివర్ణించారు. పారిస్ ఒలింపిక్స్ లో నేడు జరిగిన మ్యాచ్ లో భారత హాకీ జట్టు మహాద్భుత విజయం సాధించిందని, ప్రతి గోల్ చరిత్రలో నిలిచిపోతుందని లోకేశ్ పేర్కొన్నారు. 

"వరుసగా రెండో ఒలింపిక్స్ లోనూ కాంస్యం సాధించడం పట్ల భారత హాకీ జట్టుకు అభినందనలు... మీరు సాధించిన విజయం పట్ల గర్విస్తున్నాం" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News