MP Kalishetty Appalanaidu: తెలుగు తేజం కృష్ణ చివుకులను క‌లిసిన‌ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

MP Kalishetty Appalanaidu Met NRI Krishna Chivukula in Chennai
  • చెన్నైలో కుటుంబ స‌మేతంగా వెళ్లి క‌లిసిన ఎంపీ కలిశెట్టి 
  • ఏపీలో పెట్టుబ‌డులు, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌పై కృష్ణ చివుకులతో ఎంపీ చ‌ర్చ‌లు
  • 'అన్న క్యాంటీన్ల' నిర్వహణకు సాయం కోరిన క‌లిశెట్టి
  • మద్రాస్‌ ఐఐటీకి రూ. 228 కోట్ల విరాళం ఇవ్వడంపై అభినందన‌లు
అమెరికాలో స్థిరపడ్డ తెలుగు తేజం కృష్ణ చివుకులను చెన్నైలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సమేతంగా వెళ్లి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఏపీతో పాటు రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాలని చివుకులను క‌లిశెట్టి కోరారు. అలాగే ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రారంభిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణకు సాయం చేయాల్సిందిగా కోరారు. 

తాను చదువుకున్న మద్రాస్‌ ఐఐటీకి రూ. 228 కోట్ల విరాళం ఇవ్వడంపై చివుకుల‌ను ఎంపీ క‌లిశెట్టి అభినందించారు. 'ఎవరో ఒకరు దాతృత్వ దీపం వెలిగించాలి' పేరిట ఈనాడు- ఈటీవీలో వచ్చిన కృష్ణ చివుకుల ఇంటర్వ్యూ చూసి ఆయన గురించి తెలుసుకున్నట్లు ఎంపీ కలిశెట్టి చెప్పారు. దాంతో వెంటనే అపాయింట్మెంట్ తీసుకుని కుటుంబ సమేతంగా చెన్నై వెళ్లి ఆయనను క‌లిశారు.
MP Kalishetty Appalanaidu
Krishna Chivukula
NRI
Andhra Pradesh

More Telugu News