Telangana: కాలిఫోర్నియాలోని 'ఆపిల్ పార్క్‌'ను సందర్శించిన రేవంత్ రెడ్డి బృందం

TG delegation visits Apple California headquarters

  • తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలను ఆపిల్ ఇంక్ ప్రతినిధులకు వివరించిన బృందం
  • పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ అనువైన ప్రదేశమని సీఎం ట్వీట్
  • శంతను నారాయణన్‌తోనూ సమావేశమైన ముఖ్యమంత్రి

రేవంత్ రెడ్డి బృందం కాలిపోర్నియాలోని క్యూపర్టినోలోని ఆపిల్ సంస్థ ప్రధాన కార్యాలయం ఆపిల్ పార్క్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం... టెక్ దిగ్గజ అధికారులకు వివరించింది.

ఆపిల్ పార్క్‌ను సందర్శించడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అనేక రంగాలలో పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణకు అనువైన ప్రదేశమని పేర్కొన్నారు. 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ అనేక రంగాల్లో పలు పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉందని... హైదరాబాద్, తెలంగాణ గురించి బలంగా గళం వినిపించడానికి అనువైన ప్రదేశమన్నారు.

తాను, తన సహచర మంత్రి శ్రీధర్ బాబు, సీనియర్ అధికారులు ఆపిల్ ఇంక్ ప్రతినిధులను కలిసి తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న కొత్త ఎలక్ట్రానిక్స్ పార్క్, స్కిల్స్ యూనివర్సిటీ, ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ గురించి వివరించామన్నారు. తమ మధ్య స్నేహపూర్వక, ప్రోత్సాహకర చర్చలు జరిగాయని, ఇవి హైదరాబాద్‌కు, తెలంగాణకు సానుకూల ఫలితాలను ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

శంతను నారాయణన్‌తో సీఎం భేటీ

కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్‌ను కూడా సీఎం కలిశారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటన ప్రకారం, ఇరువురి మధ్య స్నేహపూర్వక, ఫలవంతమైన చర్చలు జరిగాయి.

'అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో అత్యంత గౌరవనీయమైన టెక్ విజనరీలో ఒకరిగా, స్ఫూర్తిదాయక వ్యక్తిగా ఉన్న శంతను నారాయణ్‌ను కలవడం కూడా ఆనందంగా ఉంది' అని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీలో కీలకమైన ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్న నారాయణన్ హైదరాబాద్ 4.0 విజన్‌కు మద్దతివ్వడానికి ముందుకు వచ్చారని తెలిపారు.

  • Loading...

More Telugu News