Corona Virus: భవిష్యత్తులో మరిన్ని ప్రమాదకర కరోనా వేరియంట్స్.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

WHO Issues Urgent Alert On Potentially Severe Variants

  • 84 దేశాల్లో కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతోందన్న డబ్ల్యూహెచ్ఓ అధికారి
  • ఐరోపాలో ఈ రేటు 20 శాతానికిపైనే ఉందని హెచ్చరిక
  • కరోనా ప్రమాదం ఎక్కువగా ఉన్న వారు టీకా తీసుకోవాలని సూచన

కరోనా మరుగున పడిందన్న అలసత్వంతో ఉన్న వారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా కీలక హెచ్చరిక చేసింది. 84 దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్టు తెలిపింది. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు ఉనికిలోకి వచ్చే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. 

‘‘కొవిడ్ ఇప్పటికీ మన మధ్యలోనే ఉంది. పలు దేశాల్లో వ్యాప్తిలో ఉంది. 84 దేశాల్లో కరోనా టెస్టుల్లో పాజిటివ్ ఫలితాల శాతం పెరుగుతున్నట్టు మా సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా సగటు పాజిటివిటీ 10 శాతంగా ఉన్నప్పటికీ ఐరోపాలో ఇది 20 శాతానికి పైనే ఉంది. గత కొన్ని వారాలుగా పలు దేశాల్లో కొవిడ్ కేసులు పెరిగాయి, ఒలింపిక్స్‌లో కనీసం 40 శాతం మంది క్రీడాకారులు కరోనా టెస్టుల్లో పాజిటివ్‌గా తేలారు’’ అని డబ్ల్యూహెచ్ఓ అంటువ్యాధుల నిపుణురాలు డా. వాన్ ఖెర్కోవ్ పేర్కొన్నారు. 

కరోనా బారిన పడే అవకాశాలు తగ్గేలా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని డా. ఖెర్కోవ్ సూచించారు. కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉన్న వారు టీకా తీసుకోవాలని సూచించారు. అయితే, టీకా తయారీదారుల సంఖ్య తగ్గడంతో కరోనా వ్యాక్సిన్ లభ్యత కొంత తగ్గిందని ఆమె అన్నారు. కానీ, కొవిడ్ టీకా అవసరం ఇప్పటికీ ఉందని ఆమె స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News