CJI Chandrachud: మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమా చెప్పే పాఠం ఇదే.. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్

Chief Justice Recalls Scene From Munna Bhai MBBS Movie To Teach Empathy To Young Doctors

  • పీజీఐఎమ్ఈఆర్ స్నాతకోత్సవంలో చీఫ్ జస్టిస్ ప్రసంగం
  • పేషెంట్లను అర్థం చేసుకునే సున్నిత హృదయం యువ డాక్టర్లకు ఉండాలని సూచన
  • మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలోని సన్నివేశాలు ఇదే అంశాన్ని ప్రతిఫలిస్తున్నాయని వ్యాఖ్య

పేషెంట్ల మనోభావాలను అర్థం చేసుకుని సాంత్వన కలిగించే సున్నిత హృదయం యువ డాక్టర్లకు ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్ మూవీలోని ఓ సన్నివేశాన్ని ప్రస్తావించిన చీఫ్ జస్టిస్.. వైద్యవిద్య ప్రధాన లక్ష్యం మానవాళి అభ్యున్నతేనని స్పష్టం చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎమ్ఈఆర్) స్నాతకోత్సవంలో పాల్గొన్న చీఫ్ జస్టిస్ యువ డాక్టర్లను ఉద్దేశించిన ప్రసంగించారు. 

దేశంలో వైద్య విద్య అభివృద్ధికి పీజీఐఎమ్ఈఆర్ గత 62 ఏళ్లల్లో ఎంతో చేసిందని కొనియాడారు. దేశంలో వైద్య రంగం అభ్యున్నతికి పాటుపడాల్సిన బాధ్యత యువ డాక్టర్ల మీద ఉందని అన్నారు. రోగుల సాధకబాధకాలను అర్థం చేసుకుని, సాంత్వన కలిగించాల్సిన బాధ్యత యువ డాక్టర్లపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మున్నాభాయ్ సినిమాను కూడా ప్రస్తావించారు. మూవీలోని హీరో ఆత్మీయ ఆలింగనం ఎందరో రోగులకు భరోసా, మనస్సాంతిని కలిగించిన విషయాన్ని గుర్తు చేశారు. పేషెంట్ల బాధలు, మనోభావాలను అర్థం చేసుకోవాల్సిన ఆవస్యకతను ఈ సీన్ ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. ఇటీవల నీట్ ఉదంతాన్ని కూడా ప్రస్తావించిన ఆయన మెడికల్ కాలేజీల్లో ఎంట్రీకి సంబంధించి నైతికత కూడా కీలకమని అన్నారు.

  • Loading...

More Telugu News