Nimmala Rama Naidu: తుంగభద్ర డ్యామ్ ను సందర్శించిన ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు, నిపుణుల బృందం
- తుంగభద్ర డ్యామ్ వద్ద కొట్టుకుపోయిన 19వ నెంబరు గేటు
- పునరుద్ధరణ పనులను పరిశీలించి నిమ్మల రామానాయుడు
- రామానాయుడు వెంట స్పెషల్ చీఫ్ సెక్రటరీ
- ఇంజినీర్ ఇన్ చీఫ్
కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. 19వ నెంబరు గేటు మూసివేసే సమయంలో గొలుసు తెగిపోవడంతో ఈ ఘటన జరిగింది. గేటు లేకపోవడంతో 35 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది.
ఈ నేపథ్యంలో, ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు తుంగభద్ర ప్రాజెక్టును సందర్శించారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంజినీర్ ఇన్ చీఫ్, నిపుణులు కూడా హోస్పేటలో ఉన్న తుంగభద్ర డామ్ వద్దకు వెళ్లింది. అక్కడ జరుగుతున్న పునరుద్ధరణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. కొత్త గేటు బిగించడంపై అక్కడి ఇంజినీర్లతో మాట్లాడారు.