Neeraj Chopra: భారత్ ఒలింపిక్ స్టార్లు నీరజ్ చోప్రా-మనూ బాకర్ ప్రేమలో పడ్డారా?.. వీడియో ఇదిగో!

Are Paris Olympic Stars Neeraj Chopra And Manu Bhakar  In Love
  • నీరజ్ చోప్రా, మను బాకర్ సన్నిహితంగా మాట్లాడుకుంటున్న ఫొటోలు వెలుగులోకి
  • నీరజ్ చేతిని తన తలపై పెట్టుకుని ఒట్టు తీసుకున్న మను తల్లి
  • ఈ స్టార్లు ఇద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారంటూ కామెంట్లు
పారిస్ ఒలింపిక్స్ ఇండియన్ స్టార్లు నీరజ్ చోప్రా-మను బాకర్ ప్రేమలో పడ్డారా? ఇప్పుడీ వార్త తెగ వైరల్ అవుతోంది. నిన్న వీరిద్దరూ సన్నిహితంగా ఉండి మాట్లాడుకుంటున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య ‘ఏదో’ ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 

నీరజ్ చోప్రా, మను బాకర్ ఇద్దరూ సిగ్గులు పోతూ మాట్లాడడం, దీనికితోడు మను తల్లి నీరజ్‌తో మాట్లాడుతూ అతడి చేతిని తన తలపై పెట్టుకుని ఒట్టు తీసుకున్నట్టుగా కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

మను, నీరజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారని కూడా వార్తలు మొదలయ్యాయి. తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలంటూ స్వయంగా మను తల్లే నీరజ్‌ను కోరినట్టు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ వార్తలపై అటు నీరజ్ కానీ, ఇటు మను కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
Neeraj Chopra
Manu Bhakar
Paris Olympics

More Telugu News