Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

Police files case against Danam Nagendar
  • నందగిరిహిల్స్ గురుబ్రహ్మనగర్‌లో పార్క్ గోడను కూల్చిన స్థానికులు
  • వారిని ఎమ్మెల్యే దానం రెచ్చగొట్టారని పోలీసులకు ఫిర్యాదు
  • ఎమ్మెల్యే సమక్షంలోనే కూల్చివేశారని ఫిర్యాదు చేసిన జీహెచ్ఎంసీ
ఖైరతాబాద్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఆక్రమణదారులను కావాలని రెచ్చగొట్టారనే ఆరోపణలపై ఆయన మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గత శనివారం జూబ్లీహిల్స్ డివిజన్‌లోని నందగిరిహిల్స్ గురుబ్రహ్మనగర్‌లో స్థానికులను రెచ్చగొట్టారని, దీంతో వారు... ఆయన సమక్షంలోనే పార్క్ గోడను కూలగొట్టారని జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీంతో దానంతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Danam Nagender
Congress
Hyderabad
BRS

More Telugu News