Manu Bhaker: నీరజ్ చోప్రాతో మను బాకర్ పెళ్లి.. షూటర్ తండ్రి ఏమన్నారంటే..!
- నీరజ్, మను బాకర్ సన్నిహితంగా మాట్లాడుకుంటున్న వీడియోలు వైరల్
- ఓ వీడియోలో నీరజ్ చేతిని తన తలపై పెట్టుకుని ఒట్టు తీసుకున్న మను తల్లి
- దీంతో ఈ స్టార్లు ఇద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారంటూ కామెంట్లు
- దీనిపై స్పందించిన షూటర్ మను తండ్రి రామ్ కిషన్ బాకర్
- మనుకు ఇంకా పెళ్లి వయసు రాలేదంటూ కామెంట్లకు పుల్‌స్టాప్ పెట్టిన వైనం
పారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా, మను బాకర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మను బాకర్ షూటింగ్‌లో రెండు కాంస్య పతకాలు సాధిస్తే.. జావెలిన్ త్రోలో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. అయితే ఒలింపిక్స్ ముగిశాక వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియో బాగా వైరల్‌గా మారింది. దాంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అంతా ప్రచారం జరిగింది.
తాజాగా దీనిపై షూటర్ మను బాకర్ తండ్రి రామ్ కిషన్ బాకర్ స్పందించారు. "మను ఇంకా చిన్న పిల్లే. ఆమెకు పెళ్లి వయసు ఇంకా రాలేదు. మేం ఆ విషయం గురించి అస్సలు ఆలోచించడం కూడా లేదు. మా దృష్టంతా ఆమె కెరీర్‌పైనే. ఇప్పట్లో ఆమె పెళ్లికి అవకాశమే లేదు" అని సమాధానం ఇచ్చారు.
అలానే మను తల్లి నీరజ్ చోప్రాతో మాట్లాడటం, తలపై చోప్రా చేతిని ఉంచి ఒట్టు తీసుకున్నట్లుగా వీడియోలో కనిపించడం కూడా బాగా చర్చనీయాంశమైంది. తమ కూతురును పెళ్లి చేసుకోవాలి అని నీరజ్‌ను మను అమ్మ కోరినట్లు చాలా మంది నెటిజన్లు మాట్లాడుకున్నారు. దీని గురించి రామ్ కిషన్ మాట్లాడుతూ నీరజ్‌ను ఆమె ఓ బిడ్డలా భావిస్తోంది అని అన్నారు.
మరోవైపు నీరజ్ అంకుల్ కూడా దీనిపై స్పందించారు. "నీరజ్ మెడల్ సాధించినప్పుడు దేశం మొత్తం ఎలా చూసిందో అలాగే పెళ్లి విషయం కూడా అందరికీ తెలుస్తుంది" అని ఆయన అన్నారు.
ఇదిలాఉంటే.. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం గెలిచిన నీరజ్ చోప్రా ఈ సారి రజతం గెలిచారు. జావెలిన్ త్రో ఫైనల్ లో రెండో ప్రయత్నంలో 89.45 మీటర్లు బల్లెం విసిరి సిల్వర్ మెడల్ సాధించారు. అయితే, ఈవెంట్ తర్వాత తన ప్రదర్శన పట్ల నీరజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను విసిరింది మంచి త్రోనే అయినప్పటికీ తనకు సంతృప్తిని ఇవ్వలేదన్నారు. ఈటెను విసిరే తన టెక్నిక్ తో కొంత మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అటు మను బాకర్ 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో రెండు కాంస్య పతకాలు దక్కించుకున్నారు.