Abhishek Boinpally: మద్యం పాలసీ కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త అభిషేక్‌కు మరోసారి ఊరట

SC extends interim bail of Abhishek Boinpally for two weeks
  • మధ్యంతర బెయిల్‌ను పొడిగించిన సుప్రీంకోర్టు
  • మధ్యంతర బెయిల్‌ను మరో రెండు వారాలు పొడిగింపు
  • ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన అభిషేక్ బోయినపల్లి
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నిందితుడు, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఆయన మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మరో రెండు వారాలు పొడిగించింది.

అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అందుబాటులో లేనందున విచారణను వాయిదా వేయాలని ఈడీ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనకు జస్టిస్ ఎంఎం సుందరేశ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం అంగీకరించింది. దీంతో విచారణను వాయిదా వేసింది.

ఈ ఏడాది జులైలో జస్టిస్ సంజయ్ కుమార్ ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్... అభిషేక్ బెయిల్ పిటిషన్‌పై మరో బెంచ్ విచారించాలని ఆదేశించింది. 

అంతకుముందు, మార్చి 20న భార్య అనారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు అభిషేక్‌కు షరతులతో కూడిన ఐదు వారాల మధ్యంతర బెయిల్‌ను ఇచ్చింది. పాస్‌‍పోర్టును అప్పగించాలని, హైదరాబాద్, ఢిల్లీని వదిలి వెళ్లరాదని ఆదేశించింది. మొబైల్ నెంబర్‌ను ఈడీ అధికారులకు ఇవ్వాలని, వారికి ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఆ తర్వాత ఈ మధ్యంతర బెయిల్‌ను పలుమార్లు పొడిగించింది.
Abhishek Boinpally
Delhi Liquor Scam
Telangana
Supreme Court

More Telugu News