MV Bhoopal Reddy: రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్

ACB arrests Rangareddy district Joint Collector while taking bribe
 
రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ భూపాల్ రెడ్డి రూ.8 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. జాయింట్ కలెక్టర్ ఎంవీ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ వై.మదన్ మోహన్ రెడ్డిని లంచం వ్యవహారంలో వల పన్ని, అరెస్ట్ చేసినట్టు ఏసీబీ డైరెక్టర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. 

ధరణి పోర్టల్ లోని నిషేధిత భూముల జాబితా నుంచి 14 కుంటల భూమిని తొలగించడానికి వారు రూ.8 లక్షల లంచం తీసుకుంటుండగా... ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 

వారిద్దరూ పట్టుబడకుండా లంచం తీసుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకున్నారని, కానీ వారి ఎత్తుగడలను తాము చిత్తు చేశామని ఏసీబీ డైరెక్టర్ సీవీ ఆనంద్ తెలిపారు.
MV Bhoopal Reddy
Bribe
ACB
Joint Collector

More Telugu News