Jogi Rajeev: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం: బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జోగి రాజీవ్
- అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేశ్ తనయుడి అరెస్ట్
- విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జోగి రాజీవ్
- రాజీవ్ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం
- కౌంటరు దాఖలు చేయాలని ఏసీబీ అధికారులకు ఆదేశం
మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జోగి రాజీవ్ ప్రస్తుతం విజయవాడ కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఈ క్రమంలో, జోగి రాజీవ్ విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు కౌంటరు దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది.
అటు, జోగి రాజీవ్ ను ఏడు రోజులు కస్టడీకి అప్పగించాలని ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు పంపింది. ఈ రెండు పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.