Narendra Modi: వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోదీ
- ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశాలకు హాజరుకానున్న మోదీ
- సెప్టెంబరు 22న భారతీయ-అమెరికన్ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగం
- సెప్టెంబరు 26న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరులో అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరుకానున్నారు. సెప్టెంబరు 22న భారతీయ-అమెరికన్ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం కోసం లాంగ్ ఐలాండ్ లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక, సెప్టెంబరు 26న జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారు. సెప్టెంబరు 26 నుంచి 30 వరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రసంగించే దేశాధినేతల జాబితాను ఐక్యరాజ్యసమితి తాజా విడుదల చేసింది.