Nara Lokesh: నారా లోకేశ్ కార్యక్రమంలో డ్రోన్ కలకలం... పోలీసుల అదుపులో ఏఎస్సై కుమార్తె!

Drone disturbance in Nara Lokesh Independence Day programme
  • గుంటూరులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న లోకేశ్
  • కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా డ్రోన్ సంచారం
  • డ్రోన్ ఎగురవేసిన యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఏపీ మంత్రి నారా లోకేశ్ కార్యక్రమంలో డ్రోన్ విహారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని లోకేశ్ ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో డ్రోన్ ఎగరడాన్ని గుర్తించిన పోలీసులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ ను ఎగురవేసిన యువతిని అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసుల విచారణలో తన పేరు నందిని అని ఆమె తెలిపింది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి ఏఎస్సై శ్రీనివాసరావు కుమార్తెనని వెల్లడించింది. తాను యూట్యూబర్ అని... గతంలో కూడా అనేక కార్యక్రమాలను ఇలాగే చిత్రీకరించానని చెప్పింది. అయితే, అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడంతో... ఆ డ్రోన్ ను పోలీసులు సీజ్ చేశారు.
Nara Lokesh
Telugudesam
Drone

More Telugu News