Hrithik Roshan: క‌ఠిన శిక్ష‌లుంటేనే వీటికి అడ్డుక‌ట్ట‌.. బెంగాల్‌ హ‌త్యాచార ఘ‌ట‌నపై హృతిక్ రోషన్‌

Hrithik Roshan Tweet Kolkata Doctor Rape Case
కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై హ‌త్యాచారం ఘ‌ట‌న గురించి దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, రాజ‌కీయ నేత‌లు ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించాడు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకూడ‌దంటే క‌ఠిన శిక్ష‌లు ఉండాల‌ని అన్నాడు.  

"ప్ర‌తి ఒక్క‌రూ స‌మానంగా సుర‌క్షితంగా ఉండే స‌మాజం మ‌న‌కు కావాలి. కానీ అది ప‌రిణామం చెందేందుకు దశాబ్దాలు పడుతుంది. ఇలాంటి సుర‌క్షిత‌మైన స‌మాజం మన కుమారులు, కుమార్తెలను శ‌క్తిమంతం చేయడంలో తోడ్ప‌డుతుంది. రాబోయే తరాలు బాగుపడతాయి. 

ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఉండాలంటే క‌ఠిన‌మైన శిక్ష‌లే ఏకైక మార్గం. అది మనకు అవసరం. బాధిత కుటుంబానికి నేను అండ‌గా ఉంటా. నిన్న రాత్రి దాడికి గురైన వైద్యులంద‌రికీ స‌పోర్ట్‌గా ఉంటా" అని హృతిక్ ట్వీట్ చేశారు.
Hrithik Roshan
Bollywood
Kolkata Doctor Rape Case

More Telugu News