Devineni Avinash: విమానం ఎక్కకుండా దేవినేని అవినాశ్ ను అడ్డుకున్న అధికారులు

YCP Leader Devineni Avinash Stopped At Shamshabad Airport Due To Lookout Notice
  • దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన అవినాశ్
  • లుకౌట్ నోటీసు ఉందని అడ్డగించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది
  • చేసేదేంలేక తిరిగి వెళ్లిపోయిన వైసీపీ నేత
దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత దేవినేని అవినాశ్ ను శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది అడ్డుకున్నారు. మంగళగిరి పోలీసులకు సమాచారం అందించగా.. ఆయనపై కేసులు నమోదైన నేపథ్యంలో ప్రయాణానికి అనుమతించవద్దని వారు కోరారు. దీంతో శంషాబాద్ లో విమానం ఎక్కకుండా అవినాశ్ ను అధికారులు అడ్డుకున్నారు. లుకౌట్ నోటీసు ఉందని గుర్తుచేశారు.

దీంతో చేసేదేంలేక విమానాశ్రయం నుంచే అవినాశ్ వెనక్కి వెళ్లిపోయారు. గురువారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుందీ ఘటన. కాగా, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాశ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడ్డ వారిలో కొంతమంది దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని పేర్కొంటూ అవినాశ్ సహా పలువురిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
Devineni Avinash
LookOut Notice
YSRCP
Shamshabad Airport

More Telugu News