Karthikeya 2: జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ-2

Karthikeya 2 elected as best telugu movie in national awards

  • 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన
  • ఉత్తమ జాతీయ నటుడిగా రిషబ్ శెట్టి
  • ఉత్తమ నటిగా నిత్య మీనన్

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం కాసేపటి క్రితం ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం రిషబ్ శెట్టి (కాంతార - కన్నడ), ఉత్తమ నటి పురస్కారం నిత్య మీనన్ (తిరుచిట్రంబళం - తమిళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ ప్రెస్ - గుజరాతీ)ని వరించాయి. 

ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా 'కార్తికేయ-2' ఎంపికయింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు ఈ అవార్డులను ప్రకటించారు. నిఖిల్ హీరోగా 2014లో వచ్చిన కార్తికేయ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే.  
 
దానికి సీక్వెల్ గా 2022లో వచ్చిన కార్తికేయ-2 చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల దుమ్ము దులిపింది. నిఖిల్, దర్శకుడు చందూ మొండేటి కలయికలో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్ ఇతర పాత్రలు  పోషించారు.

  • Loading...

More Telugu News