Sensex: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు... రూ. 7 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

Sensex gains 1331 points

  • 1,331 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 397 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా లాభపడ్డ టెక్ మహీంద్రా షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ఐటీ స్టాకుల్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు దూసుకుపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,331 పాయింట్లు ఎగబాకి 80,437కి చేరుకుంది. నిఫ్టీ 397 పాయింట్లు పుంజుకుని 24,541 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 1,400 పాయింట్ల మేర లాభపడింది. ఈరోజు మదుపరుల సంపద రూ. 7 లక్షల కోట్ల మేర పెరిగింది. 

బీఎస్ఈలో టెక్ మహీంద్రా (4.02%), టాటా మోటార్స్ (3.47%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.45%), టీసీఎస్ (2.91%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.65%) టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

  • Loading...

More Telugu News