Kalki: ఓటీటీలోకి వచ్చేస్తున్న ప్రభాస్ 'కల్కి'.. ఎప్పటి నుంచి ఏ ఓటీటీలో ప్రసారం అవుతుందంటే..!

Prabhas Kalki is coming into OTT
  • ఘన విజయం సాధించిన 'కల్కి'
  • ఆగస్ట్ 22 నుంచి నెట్ ఫ్లిక్స్ లో హిందీ వర్షన్
  • అదే రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో తెలుగు వర్షన్ ప్రసారం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కల్కి' చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రూ. 1,000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఈ చిత్రం సత్తా చాటింది. మరోవైపు, ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఆగస్ట్ 22 నుంచి ఈ చిత్రం హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. అదే రోజు నుంచి తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
Kalki
Prabhas
OTT

More Telugu News