Vinesh Phogat: భారత రెజ్లింగ్ సంఘంపై వినేశ్ ఫొగాట్ భర్త సంచలన ఆరోపణలు

Vinesh husband stays mum on wrestler retirement
  • ఫొగాట్‌కు భారతీయుల నుంచి, సహచరుల నుంచి మద్దతు లభించిందన్న భర్త
  • భారత రెజ్లింగ్ సంఘం నుంచి మద్దతు లభించలేదని ఆరోపణ
  • వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్‌పై ప్రశ్నించగా భర్త నుంచి స్పందన లేని వైనం
వినేశ్ ఫొగాట్ విషయంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పు మనకు అనుకూలంగా రాలేదని, ఇలాంటి సమయంలో భారత రెజ్లింగ్ సంఘం నుంచి మద్దతు లభించలేదని భర్త సోమ్‌వీర్ రాఠీ ఆరోపించారు. ఢిల్లీ చేరుకున్న ఫొగాట్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా సోమ్‌వీర్‌ను మీడియా ప్రశ్నించింది. వినేశ్ ఫొగాట్ తన రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కి తీసుకుంటుందా? అని ప్రశ్నించగా... ఆయన నుంచి సమాధానం రాలేదు.

యావత్ భారతం ఫొగాట్‌పై అభిమానం కురిపిస్తోందని, దీనిని తాము ఊహించలేదన్నారు. సహచరుల నుంచి కూడా మంచి మద్దతు లభించిందన్నారు. ఇంతటి అభిమానం కురిపిస్తున్నందుకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదన్నారు. కొద్దిలో పతకం చేజారిందని... ఆ తర్వాత సీఏఎస్‌లోనూ మనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో రెజ్లింగ్ సంఘం అండగా నిలబడలేదన్నారు. అథ్లెట్లకు సంఘం మద్దతు ఉండాలన్నారు.
Vinesh Phogat
Sports News
Paris Olympics

More Telugu News