Transfers: ఏపీలో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ

AP Govt issues guidelines for employees transfers

  • ఏపీలో అధికారంలోకి కూటమి ప్రభుత్వం
  • 12 శాఖల్లో బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం
  • ఈ నెలాఖరు నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి

ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై దృష్టి సారించింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం 12 శాఖల్లో బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రజా సంబంధ సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలు జరగనున్నాయి. 

పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, మైనింగ్, పౌర సరఫరాల శాఖ, అటవీ, విద్యుత్, పరిశ్రమలు, దేవాదాయ శాఖ, రవాణా శాఖల్లో బదిలీలు జరగనున్నాయి. ఆగస్టు నెలాఖరులోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 

కాగా, ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బదిలీలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే  నిర్ణయం తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News