Crorepati sweeper: చేసేది స్వీపర్ పని.. ఇంట్లో మాత్రం కోట్ల విలువైన కార్లు

Crorepati Sweeper In UP Busted Owns 9 Expensive Cars
  • ఉత్తరప్రదేశ్ లో అక్రమాలకు పాల్పడుతూ కోట్లకు పడగలెత్తిన స్వీపర్
  • ఏకంగా లగ్జరీ కార్లు కొనుగోలు చేసిన వైనం
  • ఆఫీసులో ఫైళ్లు తారుమారు చేస్తూ అక్రమ వసూళ్లు
ప్రభుత్వ ఆఫీసుల్లో స్వీపర్ ఉద్యోగం చేసే వారి జీవితం సాధారణంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఓ సొంతిల్లు, టూవీలర్ సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. పోనీ కాస్త పొదుపుగా ఉంటే చిన్నపాటి కారు కొనుగోలు చేయొచ్చు. కానీ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ స్వీపర్ ఇంట్లో మాత్రం రూ. కోట్లు విలువ చేసే కార్లు కనిపించడం ఊళ్లో వాళ్లు వింతగా చెప్పుకుంటున్నారు. ఒకటీ రెండు కాదు.. ఏకంగా తొమ్మిది కార్లు ఉన్నాయి. అదికూడా స్విప్ట్ డిజైర్, ఎర్టిగా మారుతి సుజుకీ, మహీంద్రా స్కార్పియో, ఇన్నోవా, మహీంద్రా xylo వంటి ఖరీదైన కొత్త కార్లు తళతళా మెరిసిపోతుండడం చూసి సదరు స్వీపర్ రెండు చేతులా కాదు కాదు.. పది చేతులా సంపాదిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. సదరు స్వీపర్ కార్ల సంగతి, ఆయన వెలగబెడుతున్న రాయల్ లైఫ్ గురించి ఆనోటా ఈనోటా అధికారుల దృష్టికి చేరింది. దీంతో విచారణ ప్రారంభించిన అధికారులు.. స్వీపర్ ఇంట్లో పార్క్ చేసిన కార్లను చూసి అవాక్కయ్యారు. ఉత్తరప్రదేశ్ లో కోట్లకు పడగలెత్తిన సదరు స్వీపర్ వివరాలు..

గోండా జిల్లాకు చెందిన స్వీపర్ సంతోష్‌ జైస్వాల్‌ తొలుత గోండా మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా చేరాడు. ఆపై అక్రమంగా డివిజనల్ కమిషనర్ ఆఫీసులో స్వీపర్ గా ప్రమోషన్ పొందాడు. ఆఫీసులో చేరాక అక్రమాలకు తెరతీసి ఎడాపెడా సంపాదించడం మొదలుపెట్టాడు. ఆఫీసులోని ఫైళ్లను తారుమారు చేయడం, సంబంధిత పార్టీల నుంచి భారీగా బహుమానాలు పొందడం సంతోష్ నిత్యకృత్యంగా మారింది. సంపాదన రూ. కోట్లకు చేరింది. దీంతో సంతోష్ లగ్జరీగా బతకడం మొదలుపెట్టాడు. ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ వాటిని దర్జాగా ఇంటిముందు ప్రదర్శించుకునేవాడు. అయితే, అవినీతి ఎంతోకాలం దాగదు కదా. ఇటీవల సంతోష్ నిర్వాకం అధికారుల దృష్టికి రావడంతో కమిషనర్ విచారణకు ఆదేశించాడు. అక్రమాలు బయటపడడంతో సస్పెండ్‌ చేసి, పోలీస్‌ కేసు పెట్టారు. ప్రస్తుతం సంతోష్ బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Crorepati sweeper
Uttar Pradesh
Sweeper owns cars
luxary cars

More Telugu News