Mamata Banerjee: సీఎం మమతా బెనర్జీపై నమ్మకం పోయింది: హత్యాచార మృతురాలి తండ్రి

Kolkata victim father says they lost trust in CM Mamata Banerjee
  • కోల్ కతాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం
  • జరుగుతున్న పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేసిన మృతురాలి తండ్రి
  • న్యాయం కోసం ముఖ్యమంత్రి చేస్తున్నది ఏమీ లేదని వ్యాఖ్యలు
కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు తాజా పరిణామాల పట్ల కలత చెందుతున్నట్టు తెలిపారు. మృతురాలి తండ్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై నమ్మకం పోయిందని అన్నారు. 

"ఇంతకుముందు మమతా బెనర్జీపై ఎంతో నమ్మకం ఉండేది. ఇప్పుడా భావన పోయింది. ఆమె కూడా న్యాయం చేయాలని అడుగుతున్నారు. కానీ ఆ దిశగా ఆమె చేస్తున్నది ఏమీ లేదు. ఓవైపు ఆమె న్యాయం కావాలి అంటూనే... న్యాయం కావాలి అని నినదిస్తున్న సాధారణ ప్రజలను నిర్బంధిస్తున్నారు. ఆమె ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడంలేదు. 

ఈ హత్యాచార ఘటనలో సీసీటీవీ ఫుటేజి ప్రకారం సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేశారు. కానీ ఒక్కడి వల్ల ఈ ఘాతుకం జరిగి ఉండదని, ఇందులో ఇతరులు కూడా ఉండొచ్చని అందరూ అంటున్నారు. మేం మొదటి నుంచి ఇదే చెబుతున్నాం" అని వ్యాఖ్యానించారు.
Mamata Banerjee
Kolkata Incident
Victim Father
RG Kar Medical College
West Bengal

More Telugu News