Google Pixel 8a: బంపర్ ఆఫర్... గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ ధర ఏకంగా రూ.13 వేల తగ్గింపు

Google Pixel 8a is now available at a steep discount price
  • అమెజాన్‌ లో ఏకంగా 22 శాతం డిస్కౌంట్‌ ఆఫర్
  • గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్
  • రూ.59,999 నుంచి రూ.46,999కి తగ్గిన ఫోన్ రేటు
గూగుల్ నుంచి ఇటీవలే కొత్త స్మార్ట్‌ఫోన్లు గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9ప్రో, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ మార్కెట్‌లోకి విడుదలైన విషయం తెలిసిందే. దీంతో 2023లో విడుదలై జనాదరణ పొందిన గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ల రేట్లు గణనీయంగా తగ్గాయి. ఈ ఫోన్ కొనాలనుకుంటున్న కస్టమర్లకు గుడ్‌న్యూస్ వచ్చింది. భారీ తగ్గింపుతో సరసమైన ధరకు ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ ధర ఏకంగా రూ.13 వేలు తగ్గింది. 22 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. దీంతో గతేడాది మే నెలలో మార్కెట్‌లో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.59,999 నుంచి రూ. 46,999లకు తగ్గింది. 

ఈ భారీ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల రూపంలో అదనపు ఆదా చేసుకునే అవకాశం కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంకుల కస్టమర్లు అమెజాన్‌పై రూ.1,250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందొచ్చు. 

ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఉపయోగించుకొని కస్టమర్లు మరింత డబ్బును ఆదా చేసుకోవచ్చు. పాత ఫోన్ విలువపై ఎక్స్చేంజ్ ఆఫర్ ఆధారపడి ఉంటుంది. పాత ఫోన్ ఆధారంగా గరిష్ఠంగా రూ. 41,250 వరకు ఆదా చేసుకోవచ్చు. 

గూగుల్ పిక్సెల్ 8ఏ ఫీచర్లు ఇవే..

గూగుల్ టెన్సర్ జీ3 చిప్‌సెట్‌తో తయారైన గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ చాలా స్పీడ్‌గా పనిచేస్తుంది. హెచ్‌డీఆర్ సపోర్ట్‌తో 6.1-అంగుళాల ఓఎల్‌ఈడీ ప్యానెల్, 120హెట్జ్ రిఫ్రెష్ రేట్‌, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో పాటు కెమెరా సెటప్‌ కూడా ఆకర్షణీయంగా ఉంది. 

ఫోటోగ్రఫీ ప్రేమికులకు గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ చక్కటి అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. 64ఎంపీ ప్రైమరీ సెన్సార్, 13ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో వెనుకవైపు డుయెల్ కెమెరా చక్కగా పనిచేస్తోంది. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్స్ కోసం 13ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఫోన్ గరిష్ఠంగా 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో లభిస్తుంది.
Google Pixel 8a
Google SmartPhones
Smartphones
Tech-News

More Telugu News