EVM: ఒంగోలులో మొదలైన ఈవీఎంల రీవెరిఫికేషన్

EVM ReVerification in Ongole

  • 12 కేంద్రాల్లో పోలింగ్ సరళిపై మాజీ మంత్రి సందేహాలు
  • రీవెరిఫికేషన్ రూ.5.44 లక్షలు చెల్లించిన బాలినేని శ్రీనివాస రెడ్డి
  • కలెక్టర్, ఈసీ స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఈవీఎంల రీ చెకింగ్

ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ అధికారులు ఈవీఎంల రీవెరిఫికేషన్ చేస్తున్నారు. నియోజకవర్గంలోని 12 కేంద్రాల్లో పోలింగ్ కోసం వినియోగించిన ఈవీఎంలను పరీక్షిస్తున్నారు. ఈమేరకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రీ చెకింగ్ కోరడంతో నిబంధనల మేరకు ఈ పరిశీలన చేపట్టారు. 

భాగ్యనగర్‌లోని ఈవీఎం కేంద్రం వద్ద జరుగుతున్న ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ తమీమ్‌ అన్సారియా, ప్రత్యేక అధికారి ఝూన్సీలక్ష్మి పర్యవేక్షిస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని తరఫున ఆయన ప్రతినిధి హాజరయ్యారు.
 
పోలింగ్ సరళిపై సందేహాలు వ్యక్తం చేసిన మాజీ మంత్రి.. ఈవీఎం ఓట్లు, వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతోపాటు మొత్తం 12 కేంద్రాల్లో ఈవీఎంలను రీవెరిఫికేషన్ చేయాలని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఆయన రూ.5 లక్షల 44వేలు చెల్లించారు.

దీంతో మే 13 న పోలింగ్ జరిగిన 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 నెంబర్ కేంద్రాల్లో సోమవారం అధికారులు మాక్ పోలింగ్, రీ చెకింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం బెల్‌ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో ఆరు రోజులు జరగనుందని, రోజుకు మూడు ఈవీఎంల చొప్పున పరీశీలన కొనసాగుతుందని అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News