Kannappa: మంచు విష్ణు 'కన్నప్ప' చిత్రంలో 'కంపడు'గా ముఖేశ్ రిషి... ఫస్ట్ లుక్ ఇదిగో!

Mukesh Rishi as Kampadu in Manchu Vishnu dream project Kannappa
  • మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప
  • ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో భారీ చిత్రం
  • భద్ర గణం నాయకుడు 'కంపడు'గా ముఖేశ్ రిషి
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'కన్నప్ప'లో ముఖేశ్ రిషి కూడా నటిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర పేరు 'కంపడు'. భద్ర గణానికి నాయకుడు. భద్రగణం అంటే పురాతన పుళిందు జాతికి చెందిన ఒక బీభత్సకరమైన తెగ. సదాశివ కొండల్లో నివసించే వీరి లక్ష్యం ఒక్కటే... వంశ పారంపర్యంగా వాయులింగాన్ని పరిరక్షించడం.  

తాజాగా కన్నప్ప చిత్రం నుంచి 'కంపడు' పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తనకు అలవాటైన రీతిలో ముఖేశ్ రిషి రౌద్రం ఉట్టిపడేలా కనిపిస్తున్నారు. పోస్టర్ లో ముఖేశ్ రిషి వెనుకగా బ్రహ్మాజీని చూడొచ్చు. బ్రహ్మాజీ పాత్ర పేరు గవ్వరాజు.

కాగా, కన్నప్ప చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్ వంటి హేమాహేమీలు నటిస్తుండడంతో ఈ చిత్రంపై పాన్ ఇండియా లెవల్లో ఫోకస్ నెలకొంది. 

ఈ చిత్రం నుంచి ప్రతి సోమవారం ఒక అప్ డేట్ రిలీజ్ చేస్తున్నారు. దాదాపు ప్రతి అప్ డేట్ కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. 

కన్నప్ప చిత్రానికి మహాభారత్ ఫేమ్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Kannappa
Kampadu
Mukesh Rishi
Manchu Vishnu
Mukesh Kumar Singh
Mohan Babu
Tollywood

More Telugu News