Vinesh Phogat: రాఖీ పండుగ సందర్భంగా వినేశ్ ఫొగాట్‌కు రూ.500 నోట్ల కట్టను ఇచ్చిన సోదరుడు

Vinesh Phogat Reveals Special Gift From Brother On Raksha Bandhan
  • తన సోదరుడి జీవితకాల సంపాదన ఇచ్చాడన్న వినేశ్ ఫొగాట్
  • జీవితాంతం ఇంత డబ్బు సంపాదించాడంటూ సరదాగా వ్యాఖ్య
  • నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్లో అనర్హత వేటు పడి భారత్‌కు తిరిగి వచ్చిన వినేశ్ ఫొగాట్‌పై యావత్ భారతావని అభిమానాన్ని కురిపిస్తోంది. కుస్తీ పోటీల్లో 50 కిలోల విభాగంలో ఫైనల్లో ఆమెపై అనర్హత వేటు పడింది. ఇటీవల భారత్‌కు తిరిగి వచ్చిన ఆమెకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ నుంచి మొదలు ప్రతి ఒక్కరి నుంచి ఆమెకు ప్రశంసలు అందుతున్నాయి. ఈరోజు రక్షాబంధన్ నేపథ్యంలో వినేశ్ ఫొగాట్ వేడుకలను జరుపుకున్నారు.

ఈ రక్షా బంధన్‌కు తన సోదరుడి నుంచి ఫొగాట్‌కు ఓ గిఫ్ట్ అందింది. తన సోదరుడి జీవితకాల సంపాదన తనకు ఇచ్చాడని వినేశ్ ఫొగాట్ మురిసిపోయారు. రూ.500 నోట్లతో కూడిన కట్టను తన సోదరుడు తనకు ఇచ్చాడని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

"నాకు దాదాపు 30 ఏళ్లు. గడిచిన ఏడాది నాకు రూ.500 ఇచ్చాడు (సోదరుడు). ఆ తర్వాత ఇది (కరెన్సీ నోట్ల కట్టను చూపుతూ) ఇచ్చాడు. అతను తన జీవితాంతం (హాస్యంగా) ఇంత డబ్బు సంపాదించాడు" అంటూ పేర్కొన్నారు.
Vinesh Phogat
Sports News
Rakshabandhan

More Telugu News