Food Poisioning: ఏపీలో ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజనింగ్... ముగ్గురు చిన్నారుల మృతి

Three chuldren dies of suspected food poisioning in an orphanage in AP
  • అనకాపల్లి జిల్లాలో ఘటన
  • నిన్న సమోసాలు తిన్న పిల్లలు
  • అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రులకు తరలింపు
  • చికిత్స పొందుతూ ముగ్గురి మృతి 
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఉన్న ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజనింగ్  కారణంగా ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. 

నిన్న సమోసాలు తిన్న తర్వాత 27 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వారిని అనకాపల్లి, నర్సీపట్నంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. జాషువా (1వ తరగతి), భవాని, శ్రద్ధ (మూడో తరగతి) అనే ఈ చిన్నారుల మృతితో అనాథాశ్రమంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

కాగా, ఈ అనాథాశ్రమంలో మొత్తం 60 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. వారంతా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ కె.విజయ విచారణకు ఆదేశించారు.
Food Poisioning
Children
Death
Orphanage
Anakapalle District
Andhra Pradesh

More Telugu News