Fake Darshan Tickets: తిరుమలలో నకిలీ రూ.300 దర్శన టికెట్ల పట్టివేత

TTD Vigilance officers caught fake darshan tickets sellers
  • కలర్ జిరాక్స్ కాగితాలతో భక్తులకు టోకరా
  • చెన్నై భక్తుడ్ని మోసం చేసిన రుద్రసాగర్, అమృతయాదవ్
  • కేసు నమోదు చేసిన పోలీసులు
సుప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో మరో దందా బయటపడింది. అధికారులు నకిలీ రూ.300 దర్శన టికెట్ల ముఠా గుట్టు రట్టు చేశారు. కలర్ జిరాక్స్ టికెట్లతో వెళుతున్న వారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టికెట్ స్కానింగ్ చేసే రుద్రసాగర్ అనే వ్యక్తి ద్వారా, భక్తులు నకిలీ టికెట్లతో క్యూలైన్లలోకి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. 

రుద్రసాగర్, పాత నేరస్తుడు అమృతయాదవ్ కలిసి చెన్నైకి చెందిన మోహన్ రాజ్ అనే భక్తుడ్ని మోసం చేశారు. 4 టికెట్లకు రూ.11 వేలు వసూలు చేసి నకిలీ టికెట్లు అంటగట్టారు. కాగా, రుద్రసాగర్, అమృతయాదవ్ ఆగస్టు 17న 35 మంది భక్తులకు ఇలాగే నకిలీ టికెట్లతో దర్శనం చేయించిన వైనం కూడా బయటపడింది. 

ఈ నేపథ్యంలో, రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల స్కానింగ్ ఉద్యోగి రుద్రసాగర్ పై కేసు నమోదు చేశారు. పాత నేరస్తుడు అమృతయాదవ్ పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
Fake Darshan Tickets
Tirumala
TTD

More Telugu News