Sudheer Babu: అర్ష‌ద్ వార్సీ వ్యాఖ్య‌లు త‌ప్పు.. ప్రభాస్ స్థాయి చాలా పెద్ద‌ది: సుధీర్ బాబు

Sudheer Babu Counter to Arshad Warsi for Comments on Prabhas
  • 'క‌ల్కి 2898 ఏడీ'లో ప్ర‌భాస్ గెట‌ప్ జోక‌ర్‌లా ఉంద‌న్న అర్ష‌ద్‌ వార్సీ
  • మ‌రోవైపు అశ్వ‌త్థామ పాత్ర‌లో న‌టించిన అమితాబ్‌పై ప్ర‌శంస‌లు
  • దీంతో అర్ష‌ద్ వార్సీ వ్యాఖ్య‌ల‌కు టాలీవుడ్ న‌టీన‌టుల కౌంట‌ర్
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌ను ఉద్దేశించి బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సీ తీవ్ర వాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. 'క‌ల్కి 2898 ఏడీ' చిత్రంలో డార్లింగ్ గెట‌ప్ జోక‌ర్ ను త‌ల‌పించింద‌ని వార్సీ అన్నారు. మ‌రోవైపు అశ్వ‌త్థామ పాత్ర‌లో న‌టించిన బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపించారాయ‌న‌. అస‌లు మేక‌ర్స్ ప్ర‌భాస్ లుక్‌ను ఇలా ఎందుకు చేశారో త‌న‌కు అర్థం కావ‌ట్లేద‌ని చెప్పుకొచ్చారు. 

దీంతో అర్ష‌ద్ వార్సీ వ్యాఖ్య‌ల‌కు టాలీవుడ్ న‌టీన‌టులు గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తున్నారు. తాజాగా హీరో సుధీర్ బాబు కూడా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ఇండియ‌న్ సినిమాను ప్ర‌పంచ‌స్థాయికి తీసుకెళ్ల‌డంలో త‌న‌వంతు కృషి చేసిన ప్ర‌భాస్‌పై వార్సీ వ్యాఖ్య‌లు త‌ప్పు అన్నారు. ఆయ‌న స్థాయి చాలా పెద్ద‌ద‌ని సుధీర్ బాబు ట్వీట్ చేశారు. 

"నిర్మాణాత్మ‌కంగా విమ‌ర్శించిన ఫ‌ర్వాలేదు. కానీ ఇలా త‌ప్పుగా మాట్లాడొద్దు. వార్సీలో వృత్తి నైపుణ్యం లోపించిందని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఆయ‌న నుంచి ఇలాంటి వ్యాఖ్య‌ల‌ను ఎప్పుడూ ఊహించలేదు. ప్రభాస్ స్థాయి చాలా పెద్దది" అని సుధీర్ బాబు అన్నారు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. డార్లింగ్ అభిమానులు ఈ ట్వీట్‌ను తెగ షేర్ చేస్తున్నారు.
Sudheer Babu
Arshad Warsi
Prabhas
Kalki 2898 AD
Tollywood

More Telugu News