TDP: టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం... వెల్లువెత్తిన విజ్ఞప్తులు

Requests flooded in TDP grievance program
 
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేడు ప్రజా దర్బారు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ నేతలు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, బుచ్చి రాంప్రసాద్ పాల్గొన్నారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజల నుంచి ఈ కార్యక్రమంలో వినతలు వెల్లువెత్తాయి. 

క్రీడాకారులు, డీఎస్సీ అభ్యర్థులు, హోంగార్డులు, సామాన్య ప్రజలు... ఇలా విజ్ఞప్తులతో భారీగా తరలివచ్చారు. వారి నుంచి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, తదితరులు ఓపికగా అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

మంత్రి, ఇతర టీడీపీ  నేతలు గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి... పరిష్కారానికి అక్కడిక్కడే అధికారులకు ఫోన్లు చేశారు. వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
TDP
Grievance
Gummidi Sandhya Rani
Andhra Pradesh

More Telugu News