Gold Star 650: రాయల్ ఎన్ ఫీల్డ్ కు పోటీగా భారత మార్కెట్ లోకి ‘గోల్డ్ స్టార్’

BSA Motorcycles Returns To India With the Gold Star 650

  • రీమోడలింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసిన బీఎస్ఏ
  • 650, 652 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో తయారీ
  • మూడు లక్షలకు పైగా ప్రారంభ ధర 

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ ను భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో అమ్ముడవుతున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 కి పోటీగా దీనిని తీసుకొచ్చింది. బ్రిటన్ కు చెందిన బర్మింగ్ హామ్ స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) కంపెనీ తన గోల్డ్ స్టార్ బైక్ రీమోడల్ ను ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. యూకే, యూరప్ లలో 2021 నుంచే అమ్ముతోంది. భారత్ లో క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహీంద్రా గ్రూప్ అనుబంధంగా ఉన్న బీఎస్ఏ జావా, యెజ్డీ బైక్ లను కూడా తయారుచేస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ప్రారంభ ధర రూ. 3.03 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా బీఎస్ఏ గోల్డ్ స్టార్ ధర రూ.3 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూం) గా ఉంది. 

డిజైన్
మోడ్రన్ క్లాసిక్ డిజైన్‌లో గుండ్రని హెడ్‌ల్యాంప్, కర్వ్డ్ ఫెండర్‌లతో బైక్ ను తీర్చిదిద్దారు. బైక్ క్రోమ్‌తో పాటు సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్, సింగిల్-పీస్ సీటు.. వైర్-స్పోక్ వీల్స్‌ తో డిజైన్ చేశారు. డిజిటల్ రీడౌట్, యూఎస్ బీ ఛార్జింగ్‌తో కూడిన ట్విన్ పాడ్ మీటర్ ఉంది. 1938-1963 మధ్య కాలంలో విక్రయించిన బైక్ డిజైన్ కు మార్పులు చేసి అధునాతనంగా తీర్చిదిద్దారు.

ఇంజిన్ సామర్థ్యం..
బీఎస్ఏ గోల్డ్ స్టార్ ను బీఎస్ఏ 650, 652 సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో తయారుచేసింది. 5 స్పీడ్ గేర్ బాక్స్, ఇంజిన్ 6,500 ఆర్ పీఎం వద్ద 45 బీహెచ్ పీ శక్తిని.. 4,000 ఆర్ పీఎం వద్ద 55 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బ్రేకింగ్ మరియు సస్పెన్షన్
సస్పెన్షన్ డ్యూటీ కోసం ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్‌లను అమర్చారు. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ తో ముందువైపు 320 ఎంఎం, వెనక 255 ఎంఎం డిస్క్ బ్రేక్ సెటప్‌ ఏర్పాటు చేశారు.

బైక్ కలర్, ధర (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)
హైలాండ్ గ్రీన్, ఇన్‌సిగ్నియా రెడ్.. ధర రూ. 3 లక్షలు.
మిడ్‌నైట్ బ్లాక్, డాన్ సిల్వర్.. ధర రూ. 3.12 లక్షలు.
షాడో బ్లాక్ ధర రూ. 3.16 లక్షలు
షీన్ సిల్వర్ ధర రూ. 3.35 లక్షలు

  • Loading...

More Telugu News