Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court to hear arguments in Kejriwal bail petition
  • ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితుడిగా కేజ్రీవాల్ పై ఆరోపణలు
  • ఈ కుంభకోణంలో కింగ్ పిన్ కేజ్రీవాల్ అంటున్న సీబీఐ
  • కేజ్రీకి బెయిల్ ఇవ్వొద్దని కోరుతున్న దర్యాప్తు సంస్థ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ కుంభకోణంలో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని సీబీఐ చెపుతోంది. లిక్కర్ పాలసీలో నిర్ణయాలన్నీ కేజ్రీవాల్ సమ్మతితోనే తీసుకున్నారని... ఆయనకు ప్రతిదీ తెలుసని చెప్పింది. దర్యాప్తు సంస్థ అడిగిన ప్రశ్నలకు కేజ్రీవాల్ సరైన సమాధానాలు ఇవ్వడం లేదని పేర్నొంది. విచారణను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని తెలిపింది. ఏ కోణంలో చూసినా కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడం సమర్థనీయం కాదని చెప్పింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బెయిల్ వస్తుందా? లేదా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
Arvind Kejriwal
Delhi Liquor Scam
AAP

More Telugu News