Central Government: 156 రకాల మందులను కేంద్రం నిషేధించింది .. అవి ఏమిటంటే.!

central govt bans 156 fixed dose combination drugs
  • నిషేధించిన మందుల్లో ఎక్కువగా జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీకి వాడే ఔషధాలు
  • ఈ కాంబినేషన్ డ్రగ్స్ వాడటం ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుందన్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం 156 రకాల మందులను నిషేదించింది. రోగులకు ముప్పు తెచ్చే అవకాశం ఉందన్న కారణంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది. కేంద్రం నిషేదించిన వాటిలో ఎక్కువగా జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీలకు వాడే మందులు ఉన్నాయి. స్థిర మోతాదులో రెండు, అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషద పదార్ధాలను కలిపి వాడే మండులను కాంబినేషన్ డ్రగ్స్ అని, కాక్‌టెయిల్ డ్రగ్స్ గా పరిగణిస్తూ ఉంటారు. 

ఎసెక్లోఫెనాక్ 500 ఎంజీ + పారాసెటమాల్ 125 ఎంజీ టాబ్లెట్ లను; మెఫెనమిక్ యాసిడ్ + పారాసెటమాల్ ఇంజెక్షన్; సెట్రిజెన్ హెచ్‌సీఎల్ + పారాసెటమాల్ + ఫినైలెఫ్రెన్ హెచ్‌సీఎల్; లెవొసెట్రిజిన్ + ఫినైలెఫ్రెన్ హెచ్‌సీఎల్ + పారాసెటమాల్ వంటివి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిషేదిత మందుల జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు ఈ నెల 12న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉండగా, ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) మందులను వాడటం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుందని అందులో పేర్కొన్నారు.
Central Government
Drugs
combination drugs
bans

More Telugu News