Arvind Kejriwal: మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతి

CBI secures sanction to prosecute Delhi CM Arvind Kejriwal
  • కేజ్రీవాల్‌ను విచారించడానికి కోర్టులో సీబీఐ పిటిషన్
  • ఆగస్ట్ 27న అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోనున్న సీబీఐ
  • ఈ నెల 27తో ముగియనున్న కేజ్రీవాల్ కస్టడీ
రద్దయిన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి సీబీఐకి కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. కేజ్రీవాల్‌ను విచారించేందుకు కేంద్ర దర్యాఫ్తు సంస్థ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను విచారించడానికి కోర్టు అనుమతి తప్పనిసరి.

కేజ్రీవాల్ పాత్రపై సీబీఐ అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసింది. దీనిని కోర్టు ఆగస్ట్ 27న పరిగణనలోకి తీసుకోనుంది. సీఎంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతి లభించింది. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల 27తో ముగియనుంది.
Arvind Kejriwal
AAP
Delhi Liquor Scam

More Telugu News