KTR: అక్రమ ఇళ్ల కూల్చివేత... మంత్రి పొంగులేటికి కేటీఆర్ కౌంటర్

KTR counter to Minister Ponguleti Srinivas Reddy
  • తన ఇల్లు ఎఫ్‌టీఎల్‌లో ఉంటే కూల్చేయవచ్చునన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • మంత్రికి శ్రమ అవసరం లేదు... శాటిలైట్ మ్యాప్స్ ఉన్నాయన్న కేటీఆర్
  • చెరువులను ఎలా పూడ్చి కట్టారో... శాటిలైట్ చిత్రాలు ఉన్నాయని వ్యాఖ్య
తన ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే... అక్రమమైతే కూల్చేయవచ్చునన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా ఉన్న భవనాలన్నీ కూల్చివేయాలని... నేతల భవనాలను కూల్చిన తర్వాతే సామాన్యుల ఇళ్ల జోలికి వెళ్లాలన్నారు.

తన ఇల్లు బఫర్ జోన్‌లో లేదన్న మంత్రికి శ్రమ అవసరం లేదని, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని నిర్మాణాలకు సంబంధించి శాటిలైట్ మ్యాప్స్ ఉన్నాయన్నారు. ఆయన బాధపడాల్సిన పనిలేదన్నారు. చెరువులను ఎలా పూడ్చి కట్టారో... అవన్నీ శాటిలైట్ చిత్రాలు ఉన్నాయని వెల్లడించారు.

శాటిలైట్ ఇమేజెస్ చూసుకొని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో మాట్లాడుకోవాలన్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలను మొదట కూల్చడం ప్రారంభించాలన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్, కేవీపీ రామచంద్రరావు, మధుయాష్కీ, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితర నేతల భవనాలను కూల్చివేయాలన్నారు.
KTR
Ponguleti Srinivas Reddy
BRS
Congress

More Telugu News