Telangana: రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల విషయంలో తెలంగాణ సీఎస్ కీలక ఆదేశాలు

Telangana cs key orders to collectors
  • రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లను కలెక్టర్ లు తనిఖీలు చేయాలంటూ ఆదేశాలు 
  • నెలకు ఒకసారి హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లలో కలెక్టర్లు రాత్రి బస చేయాలని స్పష్టీకరణ 
  • తనిఖీల్లో తీసుకున్న చర్యలను డైరీలో రాయాలని సూచన  
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై కలెక్టర్ లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. నెలకు ఒకసారి రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో నిద్ర చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కలెక్టర్లు రాత్రి హాస్టల్స్ లో బస చేసి పరిస్థితులను తెలుసుకోవాలని అన్నారు.
 
అదే విధంగా స్కూళ్లు, హాస్టల్స్ తనిఖీల్లో తీసుకున్న చర్యలను డైరీలో రాయాలని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని అనేక పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కలుషిత ఆహారం, విష జ్వరాలు, సౌకర్యాల లేమి తదితర సమస్యలపై విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాలతో పాటు ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana
CS Santi kumari
District Collector

More Telugu News