Fire Accident: ఏపీలో మరో ప్రమాదం.. ఇద్దరి మృతి

Blast in crackers factory in Chittoor district
  • చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన
  • బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు
  • ప్రమాదంలో భార్య, భర్త మృతి
ఏపీలో చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మరువక ముందే మరో కంపెనీలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. 

చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. బాణసంచా తయారీ కేంద్రం యజమాని ఖాదర్ బాషాతో పాటు ఆయన భార్య షహీనా ప్రాణాలు విడిచారు. 

పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాణసంచా అమ్మకాల లైసెన్స్ తో వీరు ఏకంగా బాణసంచా తయారీ కేంద్రాన్ని నడుపుతున్నారని పోలీసులు గుర్తించారు. బాణసంచా తయారీ కోసం తెప్పించుకున్న నల్లమందే పేలుడుకి కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Fire Accident
Chittoor District

More Telugu News