Pinnelli: మరికాసేపట్లో జైలు నుంచి పిన్నెల్లి విడుదల

Pinnelli Ramakrishna Reddy Release From Nellore Jail

  • ఈవీఎం ధ్వంసం కేసులో జైలుపాలైన మాజీ ఎమ్మెల్యే
  • శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
  • టైమ్ అయిపోవడంతో విడుదల చేయని నెల్లూరు జైలు అధికారులు

ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో జైలుపాలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరికాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ కేసులో ఏపీ హైకోర్టు శుక్రవారం ఆయనకు బెయిలు మంజూరు చేసింది. అయితే, జైలు సమయం మించిపోవడంతో శుక్రవారం అధికారులు ఆయనను విడుదల చేయలేదు. నిబంధనల ప్రకారం ఈ రోజు విడుదల కానున్నారు. ఈ ఏడాది మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచరులతో కలిసి విధ్వంసం సృష్టించారు.

పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. పోలింగ్ సిబ్బందిని బెదిరించడం, రక్షణ ఏర్పాట్లలో ఉన్న పోలీసులపై దాడి చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేసి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు పిన్నెల్లికి రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కొన్నిరోజులుగా ఆయన అక్కడే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పిన్నెల్లి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారించిన హైకోర్టు.. పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News