Pinnelli Ramakrishna Reddy: జైలు నుంచి పిన్నెల్లి విడుదల.. మాచర్లకు పయనం

Pinnelli left to Macharla from central jail
  • పిన్నెల్లికి నిన్న బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
  • నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కాసేపటి క్రితం విడుదల
  • స్వాగతం పలికిన కాకాణి, అనిల్ కుమార్ యాదవ్
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈవీఎంను ధ్వంసం చేయడం, పోలీసు అధికారిపై దాడికి యత్నించడం వంటి కేసుల్లో ఆయన సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ఏపీ హైకోర్టు నిన్న పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే హడావుడిగా తన వాహనంలో ఆయన మాచర్లకు బయల్దేరారు. మరోవైపు పిన్నెల్లి విడుదలవుతున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు జైలు వద్దకు వెళ్లారు.
Pinnelli Ramakrishna Reddy
YSRCP
jail
bail

More Telugu News