N Convention: మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదు చేసిన 3 రోజుల్లోనే... ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేసిన‌ హైడ్రా

Ministr Komatireddy Venkat Reddy Complaint on Nagarjuna N Convention

  • ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా
  • క‌బ్జదారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న సంస్థ‌
  • ఇప్ప‌టికే న‌గ‌ర‌వ్యాప్తంగా ఎన్నో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ కూల్చివేత‌
  • ఈ నెల 21న హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు ఎన్‌ కన్వెన్షన్‌పై మంత్రి కోమ‌టిరెడ్డి లేఖ
  • తాజాగా నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చేసిన‌ హైడ్రా

ప్ర‌భుత్వ భూముల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం, చెరువుల‌ను పరిర‌క్షించ‌డం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవ‌ల‌ హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ) ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. 

ఇప్పుడు హైడ్రా ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఉక్కుపాదం మోపుతోంది. క‌బ్జదారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్ప‌టికే న‌గ‌ర‌వ్యాప్తంగా ఎన్నో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను కూల్చివేసింది. తాజాగా హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. 

అయితే, ఎన్‌ కన్వెన్షన్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఫిర్యాదు చేసిన మూడు రోజుల్లోనే హైడ్రా చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌డం గ‌మ‌నార్హం. ఎన్‌ కన్వెన్షన్‌పై చర్యలు తీసుకోవాల‌ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఈ నెల 21న హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు లేఖ రాశారు. కన్వెన్షన్‌ ఆక్రమణల వివరాలతో పాటు ఆధారాలు, శాటిలైట్‌ చిత్రాలను అంద‌జేశారు. దాంతో మంత్రి లేఖపై వెంట‌నే విచారణ చేప‌ట్టిన‌ హైడ్రా అధికారులు ఇవాళ ఉద‌యం ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేశారు.

  • Loading...

More Telugu News