KTR: మహిళా కమిషన్ కార్యాలయానికి కేటీఆర్... కార్యాలయం ఎదుట హైడ్రామా

KTR went to Women Commission

  • ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణంపై కేటీఆర్ వ్యాఖ్యలు
  • సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్
  • తనకు మహిళలపై ఎంతో గౌరవం ఉందన్న కేటీఆర్

మహిళలంటే తనకు ఎంతో గౌరవం ఉందని... ఏదో యథాలాపంగానే తాను మాట్లాడానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహిళలపై ఉన్న గౌరవంతోనే విచారణ కోసం మహిళా కమిషన్ కు వచ్చానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరి సరికాదని అన్నారు. రాష్ట్రంలోని సమస్యలను మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణంపై ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆయన కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.

మరోవైపు కేటీఆర్ రాక సందర్భంగా మహిళా కమిషన్ ఎదుట పెద్ద డ్రామా నడిచింది. కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు డిమాండ్ చేయగా... రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రెండు పార్టీల మహిళా కార్యకర్తలు పోటీపోటీగా నినాదాలు చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరగడంతో పోలీసుల వచ్చి అడ్డుకున్నారు.

  • Loading...

More Telugu News