Raghunandan Rao: ఎన్ కన్వెన్షన్ కూల్చాలని హైకోర్టు ఎప్పుడో చెప్పింది: రఘునందన్ రావు

Raghunandan Rao on N Convention
  • ఎన్ కన్వెన్షన్ ను కూల్చాలని 2014లోనే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్న రఘునందన్ రావు
  • కానీ, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చలేదని విమర్శ
  • కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేసి ఉండరని వ్యాఖ్య
సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న తమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా... ఈ ఉదయం ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది.

ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందిస్తూ... ఎన్ కన్వెన్షన్ ను కూల్చేయాలని 2014లోనే హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పని చేయలేదని మండిపడ్డారు. పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేసి ఉండరని అన్నారు. చెరువులు ఎక్కడెక్కడ కబ్జాకు గురయ్యాయో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ కు తెలియదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని దుయ్యబట్టారు.
Raghunandan Rao
BJP
KTR
BRS
N Convention

More Telugu News